Tv424x7
AndhrapradeshTelangana

తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక!!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటం వలన తెలంగాణా, కోస్తాంధ్ర ప్రాంతాల్లో రేపటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ అల్పపీడనం మరింత బలపడుతూ పశ్చిమ వాయవ్య దిశలో కదులుతుంది. గురువారం తెల్లవారుజామున ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని సూచించారు.

అక్టోబర్ 3న దక్షిణ ఒడిశా – ఉత్తర కోస్తాల మధ్య తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే మూడు రోజులు తీరం వెంబడి 30 కి.మీ/గంట వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రజలు అవసరమయిన జాగ్రత్తలు పాటిస్తూ, తీరప్రాంతంలో వాహన ప్రయాణాలు మరియు సముద్ర సంబంధిత కార్యకలాపాలపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Related posts

ఏపీలో చంద్రబాబు కొత్త పథకం..లబ్ధిదారులకు రూ.లక్ష..

TV4-24X7 News

గుంటూరులో భారీ నకిలీ సిగరెట్ల కలకలం!

TV4-24X7 News

కాళేశ్వరం రిపోర్టు చిత్తు కాగితమేనా ?

TV4-24X7 News

Leave a Comment