📍 సోంపేట, అక్టోబర్ 1:
కంచిలి గ్రామంలో జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన A5 నిందితుడు పోలీసుల చెరలో చిక్కాడు. అతని వద్ద నుంచి 12 ¾ తులాల బంగారు ఆభరణాలు, 55 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేశారు. ఈ విషయాన్ని డీఎస్పీ డి.లక్ష్మణరావు వెల్లడించారు.
కేసు నేపథ్యంకంచిలికి చెందిన రిటైర్డ్ ఒరియా లెక్చరర్ పుర్లి సింహాద్రి ప్రధానో (68) జూలై 5న తన భార్యతో కలిసి విశాఖపట్నం వెళ్లారు. తిరిగి జూలై 6 రాత్రి ఇంటికి చేరుకోగానే, ఇంటి తలుపులు పగలగొట్టి, బీరువా లాకర్‌లోని 25 తులాల బంగారం, 1 కేజీ వెండి వస్తువులు దొంగలించారని గమనించారు.
దర్యాప్తు & పట్టుబడిన విధానంఫిర్యాదు ఆధారంగా కంచిలి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం.84/2025 నమోదు అయింది. సోంపేట సిఐ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుండగా, అక్టోబర్ 1 ఉదయం కంచిలి రైల్వే స్టేషన్ వద్ద గస్తీ చేసిన పోలీసులు ఒక హిజ్రాను అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో అతడు తనతో పాటు బాబు, కబాడియా, సనాటా, టున్ని అనే నలుగురితో కలిసి ఈ దొంగతనానికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. అనంతరం తన ఇంటి వద్ద దాచిన ఆభరణాలను బయట పెట్టడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్నిందితుడిని అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

