Tv424x7
National

టారిఫ్‌ల పవర్‌తోనే యుద్ధాలను ఆపిన ట్రంప్ – సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్:

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టారిఫ్‌లు విధించే శక్తి ద్వారా మాత్రమే ప్రపంచ యుద్ధాలను ఆపగలుగుతానని, ఆ శక్తి లేకపోతే ప్రస్తుతం కనీసం నాలుగు యుద్ధాలు జరుగుతున్నేవని ట్రంప్ వివరించారు.

వైట్ హౌస్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో, ట్రంప్ మాట్లాడుతూ, వివిధ దేశాలపై టారిఫ్‌లు విధించడం ద్వారా మాత్రమే ప్రపంచంలో శాంతి నెలకొల్పడం సాధ్యమైందని, అలాగే అమెరికాకు భారీ ఆదాయం కూడా వచ్చిందని పేర్కొన్నారు.

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోసారి అభిప్రాయపడ్డారు. టారిఫ్‌లతో వ్యాపార ఒప్పందాల పేరుతో రెండు దేశాలను బెదిరించి యుద్ధ విరమణకు ఒప్పించారన్నారు. ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం, అణ్వాయుధ సామర్థ్యం ఉన్న భారత్-పాకిస్థాన్ యుద్ధంలో కనీసం ఏడు ఫైటర్ జెట్లు కూలిపోయాయి. అయితే, యుద్ధం విరమించేందుకు రెండు దేశాలను ఏ విధంగా బెదిరించారన్న విషయాన్ని ట్రంప్ వెల్లడించలేదు.

Related posts

ఫాదర్స్ డే ఎలా పుట్టింది.. ఎందుకు జరుపుకోవాలి.. చరిత్ర ఏం చెబుతోంది.._

TV4-24X7 News

ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌

TV4-24X7 News

మరో గ్యారంటీ ఇస్తున్నా: మోదీ

TV4-24X7 News

Leave a Comment