జడ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధి:జడ్చర్ల మండలం బాడేపల్లిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం వడ్డించిన భోజనంలో జెర్రి (పురుగు) రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.విద్యార్థులు మాట్లాడుతూ, “ప్రతిరోజూ భోజనంలో పురుగులు వస్తున్నాయి. ఎన్ని సార్లు ఉపాధ్యాయులకు, మిడ్డే మీల్ నిర్వాహకులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నదని ఆరోపిస్తున్నారు.తల్లిదండ్రులు, స్థానికులు కూడా ఆహార నాణ్యతపై అసహనం వ్యక్తం చేస్తూ, విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
previous post
next post

