Tv424x7
PoliticalTelangana

వరంగల్‌లో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు..!పోలీస్ స్టేషన్‌లోనే వ్యక్తిపై దాడి –

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి అనుచరుల దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఆయన అనుచరుడు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు పల్లె రాహుల్‌ రెడ్డి మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించాడు.

సమాచారం ప్రకారం, కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన అప్పు వివాదంలో రాహుల్‌ రెడ్డి జోక్యం చేసుకుని, శ్రీకాంత్‌ అనే వ్యక్తిని అశ్లీల పదజాలంతో దూషిస్తూ దారుణంగా దాడి చేశాడు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా, అక్కడి ఎస్ఐ కేసు నమోదు చేయడానికి నిరాకరించినట్లు సమాచారం.

తనకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి అండ ఉందని, ఎక్కడైనా కేసు పెట్టమని రాహుల్‌ రెడ్డి బెదిరించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు.

ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రజలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

త్వరలో గ్రూప్-2 ఫలితాలు – TGPSC సన్నాహాలు వేగవంతం!!

TV4-24X7 News

కలెక్టరేట్‌లో కామాంధుడు..!

TV4-24X7 News

తెలంగాణ రాజ్యాధికార పార్టీ సమావేశం…

TV4-24X7 News

Leave a Comment