Tv424x7
Andhrapradesh

విశాఖలో దొంగనోట్ల తయారీ కలకలం

విశాఖపట్నంలో దొంగనోట్ల తయారీ ఘటన కలకలం రేపింది. స్థానిక ఎంవీపీ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రీరామ్‌ అలియాస్‌ గుప్తాగా గుర్తించారు.పోలీసులు అతని వద్ద నుంచి ప్రింటర్‌, ల్యాప్‌టాప్‌, నకిలీ నోట్లు ముద్రించేందుకు ఉపయోగించే ప్రత్యేక పేపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం ప్రకారం, గుప్తా ఆరు నెలల క్రితం ఎంవీపీ కాలనీలో అద్దెకు చేరి ఈ పనిని కొనసాగిస్తున్నట్లు తేలింది.తదుపరి విచారణలో గుప్తాపై ఇందౌర్‌, ముంబయి నగరాల్లో కూడా నకిలీ నోట్లు తయారీకి సంబంధించిన కేసులు ఉన్నట్లు బయటపడింది. ఐదేళ్ల క్రితం ఇలాంటి కేసులో జైలుశిక్ష అనుభవించి బయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రస్తుతం పోలీసులు అతనిని రిమాండ్‌కు తరలించి, నకిలీ నోట్ల తయారీ నెట్‌వర్క్‌పై మరింత దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఉల్లి కొనుగోళ్లపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

TV4-24X7 News

కక్ష సాధింపు చర్యలు ఎవరు చేయకూడదు : నంద్యాల వరదరాజుల రెడ్డి

TV4-24X7 News

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా.

TV4-24X7 News

Leave a Comment