Tv424x7
National

దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు గుర్తించిన యూజీసీ

చట్టబద్ధమైన గుర్తింపు లేకుండా అడ్మిషన్లు ఇస్తున్న నకిలీ ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కాలేజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) మరోసారి హెచ్చరించింది.

ఇటీవల ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ గుర్తింపులేని కోర్సులు నిర్వహిస్తుండటంపై యూజీసీ హెచ్చరికలు జారీ చేసింది.

కేంద్ర, రాష్ట్ర చట్టాల ప్రకారం ఈ కాలేజీ నమోదు కాలేదని, ఇది జారీ చేసే డిగ్రీలు లేదా సర్టిఫికెట్లు చెల్లవని స్పష్టం చేసింది.

యూజీసీ తాజా డేటా ప్రకారం దేశవ్యాప్తంగా 22 గుర్తింపు లేని విద్యాసంస్థలు యూనివర్సిటీలుగా నడుస్తున్నాయని తెలిపింది.

విద్యార్థులు అడ్మిషన్‌కి ముందుగా యూజీసీ వెబ్‌సైట్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల జాబితాను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించింది.

Related posts

అమ్ముడైన తొలి ప్రధాని పండిట్ నెహ్రూ బంగ్లా….. ఎంతో తెలుసా…?

TV4-24X7 News

పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు ఎందుకో తెలుసా

TV4-24X7 News

అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్‌ సమావేశాలపై చర్చ

TV4-24X7 News

Leave a Comment