అబ్దుల్లాపూర్‌మెట్‌లో సంచలన ఘటనతనకు పెళ్లి చేయాలని కోరుతూ హైటెన్షన్ టవర్ పైకి ఎక్కిన ఓ యువకుడు అందరినీ షాక్‌కు గురి చేశాడు. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తుండగా, వారి ప్రయత్నాల మధ్యలోనే యువకుడు ఆకస్మాత్తుగా టవర్ పై నుంచి దూకాడు.
టవర్ కింద ఉన్న బురదలో పడడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు మరియు పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ఈ ఘటనతో ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

