Tv424x7
National

నమ్ముకున్న వాళ్లే ప్రాణం తీశారు.. ఓ వ్యాపారి 12 పేజీల మరణ వాంగ్మూలం!

అయిన వాళ్లు ఆదుకోలేదు. తిండి తిప్పలు మానేసి చేసిన‌ వ్యాపారం పేరును తెచ్చిపెట్టినా, చెడు సహవాసాలు నిండా ముంచేశాయి. చివరికి మరణమే దిక్కంటూ 12 పేజీల సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి‌ పాల్పడ్డాడు ఓ వ్యాపారి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా‌ లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో చోటు ‌చేసుకుంది.ప్రతాప్ సింగ్ సూసైడ్ నోట్ సారాంశం లోకి వెళితే..“గౌరవనీయులైన పుర ప్రముఖులకు.. జిల్లా కలెక్టర్, సీపీ గారికి నమస్కారాలు… బంధుమిత్రులకు నా విన్నపం. నా మరణానికి నా మిత్రులే కారణం. పేకాట పేరిట నన్ను నమ్మించి 10 శాతం వడ్డీకి డబ్బులిచ్చి నమ్మించి నిండా మోసం చేశారు. వారి కారణంగానే నేను చనిపోతున్నాను. అందులో ప్రధానమైన వ్యక్తి ఎడ్ల వ్యాపారి కలీమ్, చిత్తు బొత్తుల వడ్డీ వ్యాపారి పెట్టెం స్వామి, హోటల్ జగ్గన్న ఈ ముగ్గురు తనను పేకాట బారినపడేలా చేసి నమ్మించి మోసం చేసి అప్పుల పాలు చేశారు. ఒక లక్ష రూపాయలకు వారానికి పది వేల వడ్డీ వసూలు చేస్తూ నెల రోజుల్లోనే ముప్పై లక్షలు వసూలు‌ చేశారు. వీళ్ళే కాదు తన భూములను కబ్జా చేసి, ఇంటిని అమ్మిన డబ్బులను తిరిగి‌ ఇవ్వకుండా కొందరు, ఇలా పది మందికి పైగా నన్ను మోసం చేసి మానసికంగా నరకం చూపించారు. కోటి రూపాయల పైగా ఇచ్చిన అప్పుల డబ్బులు రావాల్సి ఉన్నా, యాభై లక్షల రూపాయలకు పైగా అప్పులు అవడంతో.. ఇచ్చిన డబ్బులు రాక చేసిన అప్పులు తీరక తనువు చాలిస్తున్నా” అంటూ సూసైడ్ నోట్ లో రాసుకొచ్చాడు ప్రతాప్ సింగ్‌.

Related posts

అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్‌ సమావేశాలపై చర్చ

TV4-24X7 News

తమిళనాడులో కళ్ల ముందే కుప్పకూలిన ఇల్లు

TV4-24X7 News

మరో కుట్రకు పాల్పడుతున్న పాక్!

TV4-24X7 News

Leave a Comment