Tv424x7
Andhrapradesh

లోకేష్ ఢిల్లీ వెళ్లడం.. వైసీపీ కంగారు పడటం కామన్ !

నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి మోదీదో సమావేశం అయి వచ్చారు. సమావేశం తర్వాత ప్రధానితో చర్చించిన అంశాలు, చేసుకున్న విజ్ఞప్తుల గురించి నారా లోకేష్ ట్వీట్ చేశారు. అయితే వైఎస్ఆర్‌సీపీకి మాత్రం లోకేష్ ఢిల్లీకి వెళ్తున్న సందర్భాలు వేరని అనుమానిస్తోంది. ఆయనేదో బయటకు తెలియని కుట్రలు తమపై చేస్తున్నరని అనుమానిస్తున్నారు. అందుకే ఇలా లోకేష్ ఢిల్లీ నుంచి తిరుగుపయనం అవడం ఆలస్యం.. అసలు లోకేష్ ఏ ఉద్దేశంతో ఢిల్లీ వచ్చారో తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి ప్రయత్నాలు చేశారు.

ఏపీలో రాజకీయ పరిణామాలపై వివరించడానికి.. తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించడానికి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారన్న అనుమానాలు ఉన్నాయి. మూడు రోజుల నుంచి అనిల్ రెడ్డి పీఏ దేవరాజు సిట్ అధికారుల దగ్గర ఉన్నారు. ఆయన కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. అనిల్ రెడ్డి.. మద్యం మడుపుల్ని వసూలు చేయడం దగ్గర నుంచి చేర్చాల్సిన చోటకు చేర్చడం వరకూ మొత్తం బాధ్యతలు దేవరాజుకు ఇచ్చారని చెబుతున్నారు. ఇప్పుడు దేవరాజు అన్నీ చెప్పేసి ఉంటారని.. అదే సమయంలో లోకేష్ ఢిల్లీ వెళ్లడం అనుమానించదగ్గ అంశమేనని వైసీపీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి.

నారా లోకేష్ ..లిక్కర్ స్కామ్ సూత్రధారిని అరెస్టు చేసేందుకు అవసరమైన ముందస్తు కసరత్తు ఢిల్లీలో పూర్తి చేశారన్న అనుమానాలు వైసీపీలో ఉన్నాయి. పక్కా ఆధారాలు ఉన్నాయని బీజేపీ పెద్దలకూ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మరి వారి స్పందనేమిటో తెలియదు. అయితే.. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగిసే వరకూ ఎలాంటి రాజకీయ విశేషాలు ఉండకపోవచ్చని.. ఆ తర్వాత ఉంటాయని భావిస్తున్నారు.

Related posts

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసంతకం చేసిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే

TV4-24X7 News

పులివెందుల డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నూతన ఇన్చార్జి గా కె.వి. విజ్ఞేశ్వర్

TV4-24X7 News

ఏపీలో రాజకీయ రణరంగం ముగిసేదెప్పుడు ?

TV4-24X7 News

Leave a Comment