Tv424x7
National

కోచింగ్ సెంటర్లు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావు… అవి కమర్షియల్ సర్వీసెస్ మాత్రమే…కాబట్టి..?

కోచింగ్ సెంటర్లకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ హోదా ఉండదన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కోచింగ్ సెంటర్లను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్‌లుగా గుర్తించబోమని ఆమె స్పష్టం చేశారు.

ఎందుకు గుర్తింపు ఇవ్వరంటే?ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్‌గా పరిగణించబడటానికి నిర్దిష్టమైన అర్హతలు ఉండాలని మంత్రి తెలిపారు.

ప్రీ-స్కూల్ నుంచి సెకండరీ వరకు విద్య అందించాలి.న్యాయపరంగా, ప్రభుత్వ రూల్స్ ప్రకారం కోర్సులు నిర్వహించాలి.

వొకేషనల్ కోర్సులు అందించాలి.కానీ కోచింగ్ సెంటర్లు ఇవేమీ చేయవు. కేవలం UPSC, APPSC, TGPSC, IBPS, RRB, POLICE, NEET వంటి పోటీ పరీక్షలకు మాత్రమే ట్రైనింగ్ ఇస్తాయి. అందువల్ల వాటిని కమర్షియల్ సర్వీసెస్‌గా పరిగణిస్తామని ఆమె అన్నారు.

GST ఎందుకు?కమర్షియల్ సర్వీస్‌గా పరిగణిస్తున్నందువల్ల కోచింగ్ సెంటర్లపై 18% GST వసూలు చేస్తున్నట్లు తెలిపారు.

ఉదాహరణకు – ఒక విద్యార్థి రూ.1,00,000 ఫీజు చెల్లిస్తే, అదనంగా రూ.18,000 GST కూడా చెల్లించాల్సి ఉంటుంది.

విద్యార్థులకు హెచ్చరికకోచింగ్ సెంటర్‌ ఎంచుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.ఫీజు ఇన్‌స్టాల్మెంట్లు స్పష్టంగా తెలుసుకోవాలి.ఫేక్ ర్యాంక్ పబ్లిసిటీ చూసి మోసపోవద్దు.

ఆన్లైన్/క్యాష్ చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి.కోర్సు వ్యవధి, ఫ్యాకల్టీ వివరాలు తెలుసుకోవాలి.ఇప్పటికే చదివిన స్టూడెంట్స్‌ నుంచి నిజమైన రివ్యూలు తీసుకోవాలి.

“కోచింగ్ సెంటర్లు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావు… అవి కమర్షియల్ సర్వీసెస్ మాత్రమే. కాబట్టి GST వర్తిస్తుంది” – నిర్మలా సీతారామన్.

అనూష

Related posts

గుర్తింపు ఉంటేనే రైతుకు గౌరవం..!!

TV4-24X7 News

సముద్రం లోపల ఫైబర్ కేబుల్స్ కట్!

TV4-24X7 News

లొంగిపోయిన మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ “బిచ్చు

TV4-24X7 News

Leave a Comment