నేపాల్లో కొనసాగుతున్న భారీ నిరసనలపై కొత్త విషయాలు బయటపడ్డాయి.
Hami Nepal అనే ఎన్జీఓ ప్రెసిడెంట్ సుడాన్ గురుంగ్ ఈ ఆందోళనలకు ప్రధాన ప్రేరకుడిగా అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది.
2015 భూకంపం తర్వాత స్థాపించబడిన ఈ ఎన్జీఓకి అమెరికా కంపెనీలు సహా అనేక బ్రాండ్ల నుంచి పెద్ద ఎత్తున ఫండింగ్ వచ్చినట్లు సమాచారం.
సెప్టెంబర్ 8న సోషల్ మీడియా బ్యాన్ అమలులోకి రాకముందే నిరసన ఎలా చేయాలో చెబుతూ ఆయన వీడియో రిలీజ్ చేశారు.
దీంతో ప్రభుత్వ మార్పు వెనుక US మద్దతు ఉందా? అన్న ఆరోపణలు వెలువడుతున్నాయి.
అయితే, నిపుణులు మాత్రం ఆందోళనల అసలు కారణాలు అవినీతి, నిరుద్యోగం, రాజకీయ వారసత్వం, సోషల్ మీడియా స్వేచ్ఛ కట్టడి అని చెబుతున్నారు.
సుడాన్ గురుంగ్ కేవలం “ముఖం” మాత్రమేనని, మొత్తం కారణం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అనూష

