Tv424x7
Telangana

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…!

తొగుట:

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తొగుట సిఐ లతీఫ్, ఎస్ఐ రవికాంత్ రావు విద్యార్థులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

అధికారులు విద్యార్థులకు మహిళల రక్షణ చట్టాలు, ఫోక్సో చట్టం, బాల్య వివాహాల దుష్పరిణామాలు గురించి వివరించారు. అదేవిధంగా గుడ్ టచ్–బాడ్ టచ్, ఈవ్ టీజింగ్, గంజాయి–డ్రగ్స్ ముప్పు పై అవగాహన కల్పించారు.

“అపరిచితుల ఫోన్ కాల్స్‌కు స్పందించకూడదు, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు. గ్రామాల్లో అనుమానాస్పదంగా కనబడే వారిని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని సిఐ లతీఫ్ విద్యార్థులను అప్రమత్తం చేశారు.

షీటీమ్ ప్రాముఖ్యత, స్నేహిత మహిళా సెంటర్‌లో అందించే సేవలు, కౌన్సిలింగ్ విధానం గురించి వివరించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

అనూష

Related posts

ఉప్పల్‌- నారపల్లి ఫ్లై ఓవర్‌ పనులకు త్వరలో రీ-టెండర్‌

TV4-24X7 News

దారుణం.. ఇద్దరి గొంతు కోసి పరారైన దుండగులు

TV4-24X7 News

‘స్కిల్ వర్సిటీ’ బిల్లుపై ప్రభుత్వం కీలక నిర్ణయం‘

TV4-24X7 News

Leave a Comment