రాష్ట్రంలో జిల్లా పునర్వ్యవస్థీకరణపై మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. అమరావతిని కేంద్రంగా చేసుకుని ప్రత్యేక అర్బన్ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచనలు ప్రారంభించింది.
👉 గత ప్రభుత్వ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించినప్పటి నుంచి అనేక వివాదాలు, అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. ప్రజల అభిప్రాయాలను సక్రమంగా సేకరించకపోవడమే ఇందుకు కారణమని విమర్శలు వచ్చాయి.
👉 ఈ పరిస్థితిని సరిచేయడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం ప్రారంభించింది.
👉 ప్రజల వినతులు స్వీకరించడానికి జిల్లాల కలెక్టర్లు ముందడుగు వేశారు. ఇప్పటికే అనేక అర్జీలు అందినట్లు సమాచారం.
👉 ఉపసంఘం అందిన ప్రతిపాదనలన్నింటినీ సమీక్షించి, అసెంబ్లీ సమావేశాలకు ముందే తన నివేదికను సమర్పించనుంది.
👉 జనగణన షెడ్యూల్ దృష్ట్యా, కొత్త జిల్లాల ఏర్పాటు 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 మధ్యలోనే అమలు కావచ్చని తెలుస్తోంది.

