Tv424x7
Andhrapradesh

తాజాగా ఓ ప్రైవేట్ స్కూల్‌లో సంచలన ఘటన…..ఏంటో తెలుసా..

చిత్తూరు జిల్లా – పుంగనూరు

ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై హిందీ టీచర్ దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే…క్లాస్‌లో అల్లరి చేస్తోందని చెప్పి టీచర్ విద్యార్థిని తలపై స్కూల్ బ్యాగ్‌తో బలంగా కొట్టాడు. మొదట చిన్నగాయంగా భావించిన తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే తలనొప్పి తీవ్రత పెరగడంతో బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అనంతరం బెంగళూరులో వైద్య పరీక్షలు చేయగా, పుర్రె ఎముక చిట్లినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై బాలిక తల్లి స్కూల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వైద్యుల ప్రకారం బాలిక ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ, ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

Related posts

ఆంధ్రతీరం వైపు దూసుకువస్తున్న “మొంథా” తుఫాను..

TV4-24X7 News

మెట్ల మార్గం కు అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

TV4-24X7 News

యువకుల చేతుల్లో మత్తు పదార్థాలు స్వాధీనం..

TV4-24X7 News

Leave a Comment