Tv424x7
Andhrapradesh

మంచిర్యాలలో మంత్రి వివేక్ – ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఘర్షణ..

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. జిల్లాకు చెందిన మంత్రి వివేక్ తన సొంత ప్రాంతంలో జాతీయ జెండా కూడా ఎగురవేయలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మంచిర్యాలలో ఏకైక మంత్రిగా ఉన్నప్పటికీ, ఆగస్టు 15న ఆయన వేరే జిల్లాలో జెండావిష్కరణ చేయాల్సి వచ్చింది.

తాజాగా సెప్టెంబర్ 17న కూడా ఇన్‌చార్జ్‌గా ఉన్న మెదక్ జిల్లాలో జెండా ఎగురవేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు – మంత్రి వివేక్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.

ప్రేమ్ సాగర్ రావుకే మంత్రిపదవి వస్తుందని అంచనాలు ఉండగా, అది వివేక్‌కు రావడంతో అసహనం పెరిగిందని పార్టీ వర్గాల టాక్.

“తన నియోజకవర్గంలో అడుగుపెట్టవద్దు” అని ప్రేమ్ సాగర్ హెచ్చరించారని ప్రచారం.

ఈ పరిణామాలపై పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ, కార్యకర్తల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వలేదు అన్నట్టు, వ్యవహరిస్తున్న కంచికచర్ల విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ అధికారి (ఏఇ)

TV4-24X7 News

ప్రతి ఆహార వ్యాపారి పోస్టాక్ శిక్షణా సర్టిఫికేషన్ పొంది ఉండాలి : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హరిత రాయల్

TV4-24X7 News

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా.

TV4-24X7 News

Leave a Comment