Tv424x7
National

నిరసనల నడుమ ట్రంప్‌కు ఎర్రతివాచీ!!


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల బ్రిటన్‌ పర్యటన వివాదాస్పదమైంది. వేలాది మంది లండన్‌ వీధుల్లో నిరసనలు చేపట్టి ట్రంప్‌ యుద్ధోన్మాద విధానాలు, వాతావరణ పరిరక్షణలో అమెరికా ప్రతికూల ధోరణి, జాత్యహంకారం, కార్మిక సంఘాల అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తారు. లండన్‌ మేయర్‌ సాజిద్‌ ఖాన్‌ను ఆహ్వానించకపోవడం విమర్శలకు దారి తీసింది. యు గవ్‌ సర్వే ప్రకారం బ్రిటన్‌ ప్రజల్లో 53 శాతం మంది ట్రంప్‌ పాలన తమ దేశానికి ప్రతికూలమని అభిప్రాయపడ్డారు.

అయితే మరోవైపు, బ్రిటన్‌ ప్రభుత్వం ట్రంప్‌కు రాచమర్యాదలు కల్పించి అమెరికన్‌ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అమెజాన్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఓపెన్‌ఏఐ వంటి టెక్నాలజీ కంపెనీలతో పాటు ప్రైవేట్‌ అణువిద్యుత్‌ రంగంలోనూ ఒప్పందాలు కుదిరాయి.

బ్రిటన్‌ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారింది. జీడీపీతో పోలిస్తే రుణభారం పెరగడం, ద్రవ్యలోటు 40–50 బిలియన్‌ పౌండ్లకు చేరుకోవడం, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల దేశాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నెడుతున్నాయి. 1976లో ఐఎంఎఫ్‌ నుంచి రుణం తీసుకున్న పరిస్థితి మళ్లీ పునరావృతం కావచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రజలు వ్యతిరేకించినప్పటికీ బ్రిటన్‌ ప్రభుత్వం అమెరికా పెట్టుబడులకు ఎర్రతివాచీ పరచడం “తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం కాదని” నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

గాజా శాంతి యత్నాల్లో పురోగతి – ట్రంప్‌ను ప్రశంసించిన మోదీ!!

TV4-24X7 News

చైనా, రష్యా, భారత్ కలిస్తే అమెరికా పరిస్థితేంటి ?

TV4-24X7 News

తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

TV4-24X7 News

Leave a Comment