రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రేగడి గణపురంలో తల్లి హత్య కేసు సంచలనంమద్యం మత్తులో ఓ కుమారుడు తన కన్న తల్లినే కిరాతకంగా హతమార్చాడు. గోంగుపల్లి జంగయ్య అనే వ్యక్తి, మద్యం మత్తులో తన తల్లి నరసమ్మ (75)పై కొడవలితో దాడి చేశాడు.
మెడపై బలంగా కోయడంతో నరసమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.గ్రామస్తులు వెంటనే జంగయ్యను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

