కడప జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఆవేదన చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
సమాచారం ప్రకారం, అనగర్ల గ్రామానికి చెందిన నిఖిత అనే యువతి కొంతకాలంగా ఈదులపల్లి గ్రామానికి చెందిన లక్కినేని దేవరాజ్‌తో ప్రేమలో ఉంది. అయితే పెళ్లి విషయంలో దేవరాజ్ అంగీకరించకపోవడంతో నిఖిత తీవ్ర నిరాశకు గురైంది.
ఈ క్రమంలో శనివారం ఆమె పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే ఆమెను పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసినప్పటికీ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను కడప రిమ్స్‌కు తరలించారు.
ఇదిలా ఉండగా, పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.

