Tv424x7
Crime News

ఐబొమ్మపై పోలీసుల ఆపరేషన్ – నిర్వాహకుల సవాల్‌

హైదరాబాద్‌:

సినిమా పైరసీపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న హైదరాబాద్‌ పోలీసులు iBOMMA వెబ్‌సైట్‌ నిర్వాహకులపై గట్టి నిఘా వేసినట్లు సమాచారం. సీవీ ఆనంద్‌ నేతృత్వంలో రహస్య ఆపరేషన్‌ కొనసాగుతుండగా, ఇప్పటికే ఓ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఐబొమ్మ సూత్రధారులకూ పోలీసులు చెరుపు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇదే సమయంలో ఐబొమ్మ నిర్వాహకులు సంచలన హెచ్చరికలు జారీ చేశారు. “మా వెబ్‌సైట్‌పై చర్యలు తీసుకుంటే 5 కోట్ల మందికి పైగా ఉన్న యూజర్ల సమాచారం బయట పెడతాం” అంటూ సవాల్‌ విసిరారు. అంతేకాకుండా, “మా సర్వర్లు గ్లోబల్‌ నెట్‌వర్క్‌లో ఉన్నాయి… మమ్మల్ని ఆపలేరు, వెతకలేరు” అని పేర్కొన్నారు.

ఇక టాలీవుడ్‌పై విమర్శలు గుప్పించిన ఐబొమ్మ నిర్వాహకులు, “ప్రొడ్యూసర్లు మొదట థియేటర్లలో కెమెరాల సాయంతో సినిమాలు రికార్డు చేసే వారిని అడ్డుకోవాలి. రెమ్యూనరేషన్‌లకు భారీగా ఖర్చు చేస్తూ, మా మీదే ఫోకస్‌ పెడుతున్నారు” అంటూ ఆరోపించారు.

నిర్మాతలు మాత్రం ఏ రూపంలోనైనా పైరసీని సహించబోమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఐబొమ్మ నుండి వచ్చిన ఈ ప్రకటనతో సినిమా రంగం, పోలీస్‌ విభాగాల్లో కలకలం రేగింది.

Related posts

నిద్రలో ఉన్న భర్తపై భార్య ఏమి చేసిందో తెలుసా..?

TV4-24X7 News

నల్లగొండలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం

TV4-24X7 News

తంజావూర్‌లో దారుణం: భర్త కోపంతో

TV4-24X7 News

Leave a Comment