Tv424x7
Andhrapradesh

తిరుపతిని పేల్చేస్తామంటూ ఈమెయిల్ కలకలం

తిరుపతి: తిరుపతి నగరానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో అలజడి చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు నగరంలో బాంబులు పెట్టినట్టు హెచ్చరించడంతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

వెంటనే జిల్లా పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. తిరుమల, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి.

ప్రజలు ఆందోళన చెందవద్దని ఎస్పీ సుబ్బరాయుడు భరోసా ఇచ్చారు. “ఇలాంటి బెదిరింపులు పలు రాష్ట్రాల్లో వస్తున్నాయి. తిరుపతికి కూడా అదే తరహా బెదిరింపు వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రజలు వదంతులు నమ్మవద్దు,” అని ఆయన స్పష్టం చేశారు.

పోలీసుల ప్రకారం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉంటే నేడు చెన్నైలో సీఎం స్టాలిన్, నటి త్రిష నివాసాలకు కూడా బాంబు బెదిరింపులు రావడం గమనార్హం.

Related posts

భార్యకు ప్రియుడితో హోటల్లో ఉండే హక్కు ఉందన్న కోర్టు

TV4-24X7 News

పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు జగన్ దిగ్భ్రాంతి

TV4-24X7 News

ఏపీలో ఆ మూడు జిల్లాల్లో ఫ్లోరైడ్ ప్రభావం అధికం

TV4-24X7 News

Leave a Comment