Tv424x7
National

ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలో పొరపాటున డబ్బు పంపారా..? తెలుసుకోండి ఏం చేయాలో

నేటి డిజిటల్‌ యుగంలో ప్రతి ఒక్కరూ ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా డబ్బు లావాదేవీలు చేస్తున్నారు. అయితే చాలా సార్లు నిర్లక్ష్యంగా లేదా తప్పుగా ఒకరికి బదులు మరొకరికి డబ్బు పంపే ఘటనలు జరుగుతుంటాయి.

అలాంటి సమయంలో టెన్షన్ పడకుండా ట్రాన్సాక్షన్ స్క్రీన్‌షాట్‌ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆ తర్వాత సంబంధిత యాప్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు సంప్రదించి వివరాలు తెలియజేయాలి.

గూగుల్ పే – 1800 419 0157 / 080 6872 7374 / 0120 4456 456

ఫోన్ పే – 080 6872 7374

పేటీఎం – 0120 4456 456

భీమ్ యూపీఐ – 1800 120 1740వారికి సమస్య వివరంగా చెప్పిన తరువాత, వారు డబ్బు తిరిగి మీ ఖాతాలో జమయ్యేలా చర్యలు తీసుకుంటారు. అదనంగా, మీరు NPCI అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

నిపుణులు చెబుతున్నట్లుగా, ఆన్‌లైన్‌ లావాదేవీలలో ఖాతా వివరాలు సరిచూసి, జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ఇలాంటి సమస్యలను ముందుగానే నివారించవచ్చని సూచిస్తున్నారు.

Related posts

నేడు జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు?

TV4-24X7 News

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు – ఓటు హక్కు, వక్ఫ్‌బోర్డు పరిరక్షణపై ఊరటనిచ్చిన తీర్!!

TV4-24X7 News

ఐరాస హక్కుల కమిటీ చైర్పర్సన్‌గా ప్రీతి సరన్..

TV4-24X7 News

Leave a Comment