సిద్ధిపేట: ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రధానమని, ప్రజా ప్రతినిధులు సేవాధారంగా ఉండాలని చెప్పే మాటలను నంగునూర్ యువత ఆచరణలో చూపించింది. మండలంలోని నంగునూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు యువత ఒక వినూత్న కండీషన్ విధించింది.గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ముందుగా బాండ్ పేపర్‌పై సంతకం చేయాలని యువత నిర్ణయించింది. ఆ బాండ్ పేపర్లో అభ్యర్థులు ఈ క్రింది విషయాలను అంగీకరించాలి —పదవిలో ఉన్నంతకాలం అక్రమ ఆస్తులు సంపాదించనని,ఐదేళ్ల తర్వాత తమ ఆస్తులు పెరిగితే వాటిని గ్రామానికి తిరిగి ఇవ్వనున్నారని,తప్పుడు లెక్కలు చూపించకుండా,గ్రామాభివృద్ధి కోసం సేవకుడిగా పనిచేస్తానని స్పష్టంగా పేర్కొనాలి.గ్రామ యువత మాట్లాడుతూ — “పదవిని ప్రజల సేవ కోసం వినియోగించాలి కానీ లాభాల కోసం కాదు. గ్రామ పాలనలో పారదర్శకత ఉండాలంటే ఇలాంటి బంధపత్రాలు అవసరం” అన్నారు.ఈ నిర్ణయం గ్రామంలోనే కాదు, మండలవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ప్రజలు ఈ వినూత్న ప్రయత్నాన్ని స్వాగతిస్తూ, “ఇలాంటి నిబంధనలు ఇతర గ్రామాల్లో కూడా అమలు చేయాలి” అని అభిప్రాయపడుతున్నారు.నంగునూర్ యువత చూపిన ఈ మార్గం స్థానిక రాజకీయాల్లో నూతన దిశను సూచిస్తోందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.
previous post

