ముంబై :
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన వర్క్ డిసిప్లిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రోజుకు కేవలం 8 గంటలే పనిచేస్తానని, ఆ సమయం పూర్తయిన తర్వాత సెట్లో ఎక్కువ సేపు ఉండరని చెప్పారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అగ్ర నటి దీపికా పదుకొణె కూడా ఎక్కువ గంటల షూటింగ్స్ కారణంగా కొన్ని ప్రాజెక్టులను వదిలేసిందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభిషేక్ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.
అయన మాట్లాడుతూ – “వర్క్ అంటే కేవలం టైమ్ కాదు, క్వాలిటీ కూడా ముఖ్యం. నేను 8 గంటలపాటు శాత శాతం ఫోకస్‌తో పనిచేస్తాను. దానికంటే ఎక్కువ చేస్తే పనితనం తగ్గిపోతుంది” అని అన్నారు.
ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్నారు

