వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్ర లడ్డూ ప్రసాదం అమ్మకంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే— ఆలయంలో తయారైన లడ్డూలు పూర్తిగా ఆరకముందే విక్రయానికి పెట్టడంతో అవి బూజు పట్టి దుర్వాసన వెదజల్లుతున్నాయి.
లడ్డూలను తీసుకొచ్చే ట్రేల నుంచే దుర్వాసన రావడంతో భక్తులు ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురయ్యారు. పవిత్రంగా భావించే దేవాలయ ప్రసాదాన్ని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల భక్తులు మండిపడుతున్నారు.
దేవస్థానం అధికారులు ఈ ఘటనపై స్పష్టత ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

