ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు శాఖ పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
టిటిడి పరకామణి కేసులో లోక్ అదాలత్‌లో రాజీ రికార్డుల సీజ్ విషయమై విచారణ సందర్భంగా, హైకోర్టు పోలీస్ శాఖపై మండిపడింది.
హైకోర్టు వ్యాఖ్యలు:“డీజీపీతో సహా మొత్తం పోలీస్ శాఖ నిద్రలో ఉన్నట్టుంది. ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఈ పరిస్థితుల్లో పోలీస్ శాఖను మూసేయడమే బెటర్,” అని న్యాయస్థానం తీవ్రంగా వ్యాఖ్యానించింది.
కేసు నేపథ్యం:హైకోర్టు సెప్టెంబర్ 19న సీజ్ ఆదేశాలు ఇచ్చినా, వాటిని అమలు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.పోలీసు శాఖ తరఫున అధికారులు సమాధానమిస్తూ — CIDలో సీజ్ అధికారం గల IG పోస్టు ఖాళీగా ఉంది కాబట్టి ఆ పని చేయలేకపోయామని తెలిపారు.
హైకోర్టు ప్రతిస్పందన:దీనిపై కోర్టు తీవ్రంగా స్పందిస్తూ — “సదుద్దేశం ఉంటే మరో IG స్థాయి అధికారిని నియమించి ఆ పని చేయించవచ్చు కదా! ఇలా నిర్లక్ష్యం చేయడం అనర్హం” అని వ్యాఖ్యానించింది.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

