రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండవుతుండగా ప్రమాద పరిస్థితి నెలకొంది.
కెరళలోని కొచ్చి ప్రమదం స్టేడియంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో హెలిప్యాడ్ కుంగిపోవడంతో హెలికాప్టర్ ఒక వైపు వంగిపోయింది.
తక్షణమే పోలీస్, అగ్నిమాపక సిబ్బంది చురుగ్గా స్పందించి హెలికాప్టర్‌ను స్థిరపరిచారు. రాష్ట్రపతిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.
రాష్ట్రపతి భద్రతా విభాగం సిబ్బంది కూడా సంఘటన స్థలంలో పరిశీలన చేపట్టారు.

