Tv424x7
Andhrapradesh

ఉరేసుకుని మహిళా లెక్చరర్ ఆత్మహత్య

కడప జిల్లా, పొద్దుటూరు సిటీకడప జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మానసికంగా కుంగిపోయిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పొద్దుటూరు సిటీ ఈశ్వర్‌రెడ్డి నగర్‌లో జరిగింది.

చిన్న వయసులోనే తల్లిదండ్రులు మృతిచెందడంతో, ఇద్దరు అక్కాచెల్లెళ్లు తాత వద్ద పెరిగారు. ఇటీవల అక్క కవిత వివాహం జరగగా, చెల్లెలు మహేశ్వరి (26) తాత వద్దే ఉంటూ అతని బాగోగులు చూసుకుంటూ, చాపాడు మండలంలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది.

పేరెంట్స్ లేకపోవడం, అక్కకు పెళ్లయిపోవడంతో ఒంటరిగా ఫీలైన మహేశ్వరి మానసికంగా కుంగిపోయి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై అక్క కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా రాట కార్యక్రమం లో పాల్గొన్న కందుల

TV4-24X7 News

స్వచ్చ సర్వేక్షన్ లో భాగంగా స్థానిక మారుతీ నగర్ లో ప్రజలకు అవగాహనా కార్యక్రమం

TV4-24X7 News

మదన్ రెడ్డి విచారణకు సహకరించలేదు: సిట్

TV4-24X7 News

Leave a Comment