Tv424x7
Telangana

హనుమకొండలో దారుణం! ఏంటో తెలుసా..?

హనుమకొండ జిల్లా న్యూశాయంపేటలో జరిగిన ఘటన స్థానికులను కలవరపరుస్తోంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 7 ఏళ్ల శ్రీజ అనే బాలికపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది. ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేసిన కుక్కలతో చిన్నారి తీవ్రంగా గాయపడింది.

స్థానికులు గమనించి కుక్కలను తరిమివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడిన బాలికను తక్షణమే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వీధి కుక్కల దాడులు తరచుగా జరుగుతున్నా, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీసీ ఫుటేజ్‌ లభ్యం – దాడి దృశ్యాలు స్థానికులను షాక్‌కు గురి చేస్తున్నాయి!

Related posts

90 ఏళ్ల వృద్ధురాలిపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారం

TV4-24X7 News

తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం వేడుకలు …

TV4-24X7 News

కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్‌

TV4-24X7 News

Leave a Comment