Tv424x7
Andhrapradesh

ఉలిక్కిపడ్డ అనంతపురం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

అనంతపురం:*అనంతపురం ఉలిక్కిపడింది. నగరానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇద్దరికి కరోనా సోకిందని తెలియడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ప్రపంచం నుంచి వెళ్లిపోయిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మన ఇరుగు, పొరుగున గల తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా ప్రబలుతోందని వార్తలు వింటున్న మనం… ఇప్పుడు అనంతపురంలో ఓకే రోజు రెండు పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని, విధిగా మాస్క్ లు ధరించాలని అనంతపురం ప్రభుత్వాస్పత్రి ఆర్.ఎం.ఓ డాక్టర్ హేమలత ప్రజలను కోరారు. పెద్దఆస్పత్రిలో కోవిడ్ వార్డు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల చర్యలు చేపట్టామని ఆమె వివరించారు.

Related posts

జగన్‌ నుంచి ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించండి: సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్‌

TV4-24X7 News

పిళ్ళా శివకృష్ణ ను పరామర్శించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల

TV4-24X7 News

రామోజీరావు మృతి దిగ్భ్రాంతి కలిగించింది: YS జగన్

TV4-24X7 News

Leave a Comment