Tv424x7
Andhrapradesh

పోలీసుల ఆధ్వర్యంలో వైద్య, రక్తదాన శిబిరాలు

విశాఖపట్నం అమరవీరుల స్మారక ఉత్సవాల్లో భాగంగా నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్బీ ఆదేశాల మేరకు సోమవారం నగర ఆర్మడ్ రిజర్వ్ ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. అదేవిధంగా జోన్-1 అలాగే జోన్ -2, ట్రాఫిక్ విభాగాలలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భం గా సిబ్బందికి కంటి వైద్య పరీక్షలు, దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్టోబర్ 21వ తేదీ నుంచి జరుగుతున్న అమరవీరుల స్మారక ఉత్సవాల్లో భాగంగా లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్, విశాఖ బ్లడ్ సెంటర్, కే.జి. హెచ్ సిబ్బందితో ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్య శిబిరం శ్రీ షిరిడీ సాయి 4డి డెంటల్ పోలీ క్లినిక్, డాక్టర్ ఆగర్వాల్ ఐ హాస్పిటల్, కేజీహెచ్ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రోగులు శిబిరాలకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

Related posts

వర్రా అసభ్యకర పోస్టులు.. తాడేపల్లి కార్యాలయం నుంచే: డీఐజీ ప్రవీణ్‌..

TV4-24X7 News

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న వన్ టౌన్ సీఐ భాస్కరరావు

TV4-24X7 News

వస్తువులను మహిళ వద్దకు చేర్చిన ఎం ఆర్ పేట ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది

TV4-24X7 News

Leave a Comment