Tv424x7
Andhrapradesh

ఘనంగా ఊరికిటి గణేశ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

విశాఖపట్నం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌లు కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే, వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ఉత్తమ మహిళలను ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విశాఖ సౌత్ టిడిపి ఇన్చార్జ్ సీతoరాజు సుధాకర్ ఆదేశాల మేరకు..విశాఖ దక్షిణ నియోజకవర్గం 29వ వార్డులో స్థానిక తెలుగు దేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్ ఉరికిటి గణేష్ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవ వేడుకలు కేక్‌లు కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఊరికిటి గణేష్ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు.తదనంతరం తెలుగుదేశం మహిళ సీనియర్ కార్యకర్తలకు, స్థానిక మహిళలకు, స్థానిక చిరువ్యాపార మహిళలకు చీరలు ఇచ్చి, శాలువా కప్పి సన్మానించడం జరిగింది,ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, తెలుగు దేశం పార్టీ నాయకులు, వార్డు క్లస్టర్ ఇన్చార్జి రావి. వెంకటేశ్వర్లు, వార్డు జనరల్ సెక్రటరీ రాయన బంగార్రాజు మరియు పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌

TV4-24X7 News

బొల్లవరం మహర్షి స్కూల్ స్థలం వివాదం

TV4-24X7 News

మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీ లోకి 100 కుటుంబాలు

TV4-24X7 News

Leave a Comment