అనంతపురం, 13 సెప్టెంబర్ 2025: ఫిజియోథెరపిస్టులు “Dr” prefix వాడకం విషయంలో వచ్చిన గందరగోళానికి DGHS (Director General of Health Services) స్పష్టత ఇచ్చారు.
DGHS 09 సెప్టెంబర్ 2025న విడుదల చేసిన లేఖను 10 సెప్టెంబర్ 2025 న రద్దు చేశారు. ఈ లేఖలోని అంశాలు సరైన సమీక్ష లేకుండా వెలువడినందున, తుది నిర్ణయం తీసుకునే వరకు పూర్వ లేఖకు ఏ విధమైన చట్టపరమైన ప్రభావం ఉండదని పేర్కొన్నారు.
ఫిజియోథెరపిస్టుల సంఘాలు ఈ నిర్ణయాన్ని పాజిటివ్ డెవలప్మెంట్గా స్వీకరించాయి. సమస్యపై చర్చ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతానికి వారు “Dr” prefix వాడకం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు.

