అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం మధ్యాహ్నం అనంతపురం చేరుకున్నారు. ఆయనకు ఆర్.అండ్.బి అతిథి గృహంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ ఏ.మలోల్, తహసీల్దార్ హరికుమార్, ఆర్.అండ్.బి ఎస్ఈ మురళీకృష్ణ, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు దివాకర్ బాబు తదితరులు స్వాగతం పలికారు.
కలెక్టర్ అనంతపురం జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టి పని చేయనున్నారు అని అధికారులు తెలిపారు.

