జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల తహసీల్దార్ రవీందర్‌పై పోలీసులు పీడితురాలి ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు. విధి నిర్వహణలో కలిసి పని చేసిన మహిళా ఉద్యోగికి వాట్సాప్‌లో అసభ్యకరమైన సందేశాలు పంపి, ఫోన్ కాల్స్‌తో వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసి, మరో ఎమ్మార్వో ద్వారా రాజీ కుదుర్చుకోవాలని రవీందర్ ప్రయత్నించినట్టు సమాచారం. అయితే బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, రవీందర్‌ను రిమాండ్‌కు తరలించారు.

