మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నూరు కాంగ్రెస్ నాయకుడు కృష్ణారెడ్డి తల్లి మృతి చెందడంతో మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శకు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి వెంట కలెక్టర్ దీపక్ కూడా వెళ్లి కాంగ్రెస్ నేతను పరామర్శించారు.
.ప్రభుత్వ అధికారి స్థాయిలో ఉండి పార్టీ నాయకుడిని ప్రత్యక్షంగా పరామర్శించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారులు రాజకీయ సమన్వయం కంటే పరిపాలనకే పరిమితం కావాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

