మిడ్ మానేరులో తన ఇంటిని కోల్పోయిన చీర్లవంచ గ్రామానికి చెందిన నిర్వాసితుడు వేల్పుల ఎల్లయ్యకు పరిహారం ఇవ్వాలని గత జూన్‌లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు అధికారులు పరిహారం చెల్లించకపోవడంతో ఎల్లయ్య మరోసారి కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో ఈ రోజు హాజరు కావాల్సిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గైర్హాజరయ్యారు. అంతేకాకుండా ఎలాంటి వివరణాత్మక సమాధానం కూడా ఇవ్వకపోవడంతో, కోర్టు తీవ్రంగా స్పందించింది.
జడ్జి ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించిన కలెక్టర్‌పై కోర్టు సీరియస్‌గా తీసుకుని వారెంట్ జారీ చేసినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.
👉 మిడ్ మానేరులో నిర్వాసితులకు పరిహారం విషయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది.
👉 ఇప్పుడు కలెక్టర్‌పై హైకోర్టు వారెంట్ జారీ కావడం సిరిసిల్ల జిల్లాలో చర్చనీయాంశమైంది.

