జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రాజకీయ వేడి చర్చలకు కేంద్రంగా మారింది.బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన కడియం శ్రీహరి పార్టీ మారిన నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మేము బీఆర్ఎస్ గుర్తుకే ఓటు వేశాం, మీరు పార్టీ మారడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం” అంటూ ప్రజలు వినూత్న నిరసన చేపట్టారు.
పెద్దఎత్తున పోస్ట్‌కార్డు ఉద్యమం ప్రారంభమైంది.
ప్రజలు గుంపులు గుంపులుగా పోస్టాఫీసులకు చేరుకుని, “తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి” అనే డిమాండ్‌తో పోస్ట్‌కార్డులు పంపిస్తున్నారు.
ఈ పరిణామం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
రాజకీయ విశ్లేషకులు “ప్రజల అసహనం స్పష్టంగా బయటపడుతోంది, ఇది రాబోయే రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపవచ్చు” అని వ్యాఖ్యానిస్తున్నారు.
కడియం శ్రీహరి స్పందన కోసం ఎదురుచూస్తున్న ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

