రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ ఉబర్ కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. రోడ్లపై కిక్కిరిసిన ట్రాఫిక్‌ను తప్పించుకునేలా, ప్రయాణికులకు హెలికాప్టర్ రైడ్ సౌకర్యం అందించేందుకు ప్రణాళికలు వేస్తోంది.
ఇప్పటికే ఇటలీ, న్యూయార్క్ లాంటి నగరాల్లో హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన ఉబర్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సర్వీసులను విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
2026 నాటికి ఈ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయని కంపెనీ ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా Joby Aviation తయారు చేస్తున్న మినీ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు వినియోగంలోకి రానున్నాయి.
ఎయిర్పోర్ట్ నుంచి నగరంలోని ప్రధాన ప్రాంతాలకు నిమిషాల్లో చేరుకునే వీలుగా, సిటీల్లో ప్రత్యేక ఎయిర్ ట్యాక్సీ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
భారతదేశంలో ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తే, ముఖ్యంగా బెంగళూరు లాంటి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో ప్రయాణికులకు ఇది పెద్ద ఊరట కానుంది.

