Tv424x7
Panchangam

🌸పంచాంగం🌸

శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,తేదీ … 16 – 12 – 2023,వారం … స్థిరవాసరే ( శనివారం )శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయనం – హేమంత ఋతువు,మార్గశిర మాసం – శుక్ల పక్షం,తిథి : చవితి రా10.57 వరకు,నక్షత్రం : ఉత్తరాషాఢ ఉ9.31 వరకు,యోగం : ధృవం ఉ10.32 వరకు,కరణం : వణిజ ఉ11.26 వరకు, తదుపరి భద్ర రా10.57 వరకు,వర్జ్యం : మ1.17 – 2.47,దుర్ముహూర్తము : ఉ6.26 – 7.53,అమృతకాలం : రా10.20 – 11.50,రాహుకాలం : ఉ9.00 – 10.30,యమగండo : మ1.30 – 3.00,సూర్యరాశి : వృశ్చికం,చంద్రరాశి : మకరం,సూర్యోదయం : 6.26,సూర్యాస్తమయం: 5.24, *_నేటి విశేషం_*_*ధనుస్సంక్రమణం ప్రారంభం – రాత్రి 12.34 ని|| నుండి*_కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన , సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు రాశిలోకి ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు . ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు…ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు….అదే విధముగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అంటారు.సూర్యుడు ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం *ధనుస్సంక్రమణం.* కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. *మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒకరోజు కింద లెక్క అంటారు…**ఈలెక్కన ఉత్తరాయణం రాత్రి , దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది, సూర్యుడు కర్కాటకరాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు, అక్కడనుండి దక్షిణాయనం ప్రారంభం…*అనగా….ఇది రాత్రి కాలం…మకరరాశిలో ప్రవేశించు సమయం మకర సంక్రమణం ఇక్కడినుండి ఉత్తరాయణం. అనగా…..పగలుగా భావన.ఇలా భావించినప్పుడు… దక్షిణాయనమునకు చివరిది…ఉత్తరాయణమునకు ముందుది ఐన ధనుర్మాసం ప్రాతఃకాలమువలె పవిత్రమైనది.సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది. కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని *‘పండుగ నెలపట్టడం’* అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం… దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు.కార్తీక మాసం , మాఘమాసం , శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ.. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసమంతా.. ఉదయం , సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల మహాలక్షి కరుణా , కటాక్షాలు సిద్ధిస్తాయి.ధనుర్మాసం విష్ణువికి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది, ఈ మకర , కర్కాటక సంక్రాంతులలో స్నాన , దాన , హోమ , వ్రత పూజలు చేయడం చాలా మంచిది.

Related posts

మసీదు లోకి మహిళలను అనుమతించాలి: సుప్రీంకోర్టు

TV4-24X7 News

సెప్టెంబర్ -7 చంద్రగ్రహణం ఈ రాశులు వారు జాగ్రత్త

TV4-24X7 News

పంచాంగం

TV4-24X7 News

Leave a Comment