Tv424x7
Andhrapradesh

కడపలో వైఎస్ఆర్ అవినాష్ ర్యాలీ….

వైఎస్ఆర్ జిల్లా – కడప

కడప కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్ష చేపట్టారు.

ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, మేయర్ సురేష్ బాబు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ…

నిన్న జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మెడికల్ కళాశాలల పోరాటం ఘనవిజయం సాధించిందని తెలిపారు.

యువజన, విద్యార్థి విభాగం నాయకుల ఆధ్వర్యంలో గట్టి నిరసన తెలిపారు.

మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ కూర్చోబోమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఎరువులు–యూరియా అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

“పవన్ కళ్యాణ్‌కు ఓజీ సినిమా టికెట్ పెంపుపై ఎంత శ్రద్ధ ఉందో, అంత శ్రద్ధ రైతులపై చూపడం లేద”ని విమర్శించారు.

అధికారం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇష్టానుసారం దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు.

Related posts

మొదటి జీతాన్ని అమరావతికి విరాళం ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు

TV4-24X7 News

ఈస్ట్ ఏసీపీగా లక్ష్మణమూర్తి బాధ్యతలు

TV4-24X7 News

మంగళ, శనివారాల్లో సాగర్ – శ్రీశైలం లాంచీలు

TV4-24X7 News

Leave a Comment