Tv424x7
Telangana

కొబ్బరి బోండాలతో వెళ్తున్న డీసీఎం బోల్తా…

సూర్యాపేట జిల్లా – రాయినిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం సంచలనం రేపింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కొబ్బరి బోండాల డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

కానీ… ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో మానవత్వం మరచిన జనం వాహనానికి ఎగబడి, చెల్లాచెదురైన కొబ్బరి బోండాలను ఎత్తుకెళ్లడం అక్కడ ప్రత్యేక దృశ్యంగా మారింది.

డ్రైవర్ ప్రాణాపాయం తప్పించుకున్నప్పటికీ, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు సహాయం చేయాల్సిన జనాలు ఇలా వస్తువులపై దృష్టి పెట్టడం ఆందోళన కలిగిస్తోంది.

Related posts

పోలీస్ స్టేషన్ ఎదుట సీఐ భార్య ఆందోళన

TV4-24X7 News

తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ!!

TV4-24X7 News

కేసు నమోదు చేసిన పోలీసులుకేసు నమోదు చేసిన పోలీసులు

TV4-24X7 News

Leave a Comment