ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆందోళనలు మరింత ముమ్మరమయ్యాయి. SFI ఆధ్వర్యంలో విద్యార్థులు “చలో కలెక్టరేట్” కార్యక్రమానికి సిద్ధమయ్యారు. తరగతులు బహిష్కరించి నిరసన ర్యాలీలో పాల్గొంటూ, తమ డిమాండ్లను బలంగా వినిపిస్తున్నారు.
ఈ క్రమంలో విద్యార్థి సంఘ నాయకులను ఏయూ అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఏయూ SFI కార్యదర్శి వెంకట రమణకు పోలీసులు నోటీసులు జారీ చేసిన ఘటన విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
ఎన్ని సార్లు ఆందోళనలు చేసినా సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో విద్యార్థులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

