Tv424x7
Telangana

“ర్యాగింగ్ కారణంగా యువకుడి ఆత్మహత్య: ఐదుగురు నిందితులు అరెస్ట్”

మేడ్చల్

:మేడ్చల్‌లోని సిద్ధార్థ కాలేజీ బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.అరెస్ట్‌ అయినవారిలో శివకుమార్, ప్రశాంత్, రోహిత్, మురళీధర్, సాయి ప్రసాద్ ఉన్నారు. నిందితులను కోర్టులో హాజరు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం, సాయితేజను తన సీనియర్లు ర్యాగింగ్ చేసిన కారణంగా తీవ్ర మనస్తాపం ఏర్పడింది. ఈ నెల 21న సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్యకు ముందు, సాయితేజ ఒక సెల్ఫీ వీడియో తీసి, తన అనుభవాన్ని రికార్డ్ చేసినట్లు గుర్తించబడింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు చేశారు.

కోర్టు నిందితులను రిమాండ్‌కు పంపింది.

Related posts

మొంథా తుఫాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

TV4-24X7 News

_ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. పార్టీలు మారిన నేతల్లో ఉత్కంఠ_

TV4-24X7 News

గ్రూప్–1 కేసులో కీలక పరిణామం..

TV4-24X7 News

Leave a Comment