Tv424x7
Andhrapradesh

నంద్యాలో టీడీపీ అరాచకం: వైయస్సార్ నేతలపై ఘాతుకర దాడులు

నంద్యాల జిల్లా, బనగానపల్లె నియోజకవర్గం:

కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామంలో వైయస్సార్ పార్టీ నాయకులపై తీవ్ర దాడులు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే రామ సుబ్బారెడ్డి పై ఇటీవల జరిగిన దాడి మరవకముందే, ఈసారి బ్రహ్మం, సుధాకర్ రెడ్డి, గుర్రప్ప, శ్రీను తదితరులు (మొత్తం ఆరు మంది) రాడ్లు, కట్టెలతో దాడికి గురయ్యారు.

దాడిలో మహిళలు కూడా ముప్పు గడపగా, బాధితులు కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బాధితులను పరామర్శించారు.

స్థానికుల సమాచారం ప్రకారం, సర్పంచ్ ఎన్నికల దగ్గరపడటంతో టీడీపీ నాయకులు గ్రామాల్లో భయభ్రాంతులు సృష్టిస్తూ, వైయస్సార్ పార్టీకి చెందిన మహిళలతో అసభ్య ప్రవర్తన చేస్తున్నారు. స్థానికులు ఈ దాడులు కొనసాగితే సహించేది లేదని హెచ్చరించారు.

Related posts

ఈతకోట గ్రామంలో పలువురిపై దాడికి దిగిన పవన్ కల్యాణ్ అభిమానులు..

TV4-24X7 News

వైద్య పరీక్షల కోసం అమెరికాకు చంద్రబాబు

TV4-24X7 News

కార్తిక పౌర్ణమి మహోత్సవ సందర్భంగా శ్రీశ్రీశ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ని దర్శించుకున్న విల్లూరి

TV4-24X7 News

Leave a Comment