Tv424x7
AndhrapradeshCrime News

మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం – పోలీసులు నిర్లక్ష్యం..

గోరంట్లలో మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో, మహిళా హోంగార్డు ప్రియాంక ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ఫిర్యాదు ప్రకారం షఫీ, మైనుద్దీన్ అనే క్యాబ్ డ్రైవర్లు వేధిస్తున్నారని, అయితే స్థానిక సీఐ శేఖర్ కూడా వారికి మాత్రమే వత్తాసు పలికుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రియాంక సెల్ఫీ వీడియో తీస్తూ రహస్య ప్రాంతంలో కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగినట్లు తెలుస్తోంది. ఆమెకు అవసరమైన రక్షణ కోసం పోలీసులు గాలింపు చేపట్టినప్పటికీ, పరిస్థితి తీవ్రంగా ఉంది.

రాష్ట్రంలో పోలీస్ విభాగంలోనూ మహిళలకు సరైన రక్షణ లేకపోవడం, సామాన్య మహిళల భద్రతా అంశంలో పెద్ద ప్రశ్నను రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై హోం మంత్రి అనిత తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Related posts

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

TV4-24X7 News

మారుతున్న విశాఖ నగర మేయర్ పీఠం

TV4-24X7 News

టీడీపీ, జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్దులు దాదాపు ఖరారు?

TV4-24X7 News

Leave a Comment