కడప / ప్రొద్దుటూరు: జిల్లా ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లోరింగ్ టైల్స్ పగిలిపోయి ఆ ముక్కలు తగిలి చిన్నారులు, తల్లిదండ్రులు గాయపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఆసుపత్రి సిబ్బంది, అధికారులు సమస్యను గమనించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వసతులు లేకపోవడంతో చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తక్షణమే అధికారులు స్పందించి వార్డును మరమ్మతు చేసి, రోగులకు సురక్షిత వసతులు కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


