Tv424x7
National

నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి!.

ఆధార్ సంస్థ UIDAI నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఇకపై ఆధార్ వివరాలను ఇంటినుంచే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సెంటర్లలో క్యూలు లేకుండా, పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్‌ వంటి వివరాలను సులభంగా సవరించుకోవచ్చు.—

గవర్నమెంట్ ఐడీతో అప్‌డేట్ఇకపై ఆధార్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.

కార్డుదారులు పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, జనన ధృవపత్రం వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలతో వివరాలు మార్చుకోవచ్చు.

అప్‌డేట్ ఛార్జీలు:పేరు, చిరునామా, మొబైల్ నంబర్ అప్‌డేట్ – ₹75వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫోటో అప్‌డేట్ – ₹125పిల్లల (5–7 సం., 15–17 సం.) బయోమెట్రిక్ అప్‌డేట్ – ఉచితంఆధార్ రీప్రింట్ అభ్యర్థన – ₹40—

ఆధార్–పాన్ లింక్ తప్పనిసరికొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలి.

డెడ్‌లైన్: డిసెంబర్ 31, 2025

లింక్ చేయకపోతే జనవరి 1, 2026 నుంచి పాన్ చెల్లదు.—

ఈజీ KYC సదుపాయంనవంబర్ 1 నుంచి కేవైసీ (KYC) ప్రాసెస్ కూడా సులభం కానుంది.

బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్‌కి కేవైసీ చేయడానికి ఇక ఆధార్ నంబర్‌ చాలు.

ఓటీపీ ధృవీకరణ, వీడియో కన్ఫర్మేషన్ లేదా ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్ ద్వారా కూడా కేవైసీ పూర్తి చేయొచ్చు.

Related posts

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం

TV4-24X7 News

సైన్యానికి పూర్తి స్వేచ్ఛ, తేదీ-సమయం సైన్యమే నిర్ణయిస్తుంది: మోదీ..!!

TV4-24X7 News

SRH vs PBKS.. పైచేయి ఎవరిది..?

TV4-24X7 News

Leave a Comment