Tv424x7
National

కోర్టుకు రాహుల్ గాంధీ.. పోలీసుల మోహరింపు..

పరువు నష్టం కేసులో కోర్టుకు రాహుల్ గాంధీ.. పోలీసుల మోహరింపు..కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) పరువు నష్టం కేసులో హాజరయ్యేందుకు సుల్తాన్‌పూర్ జిల్లా సివిల్ కోర్టుకు చేరుకున్నారు..2018లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కొనసాగుతున్న కేసులో రాహుల్ గాంధీ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో కోర్టు దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాహుల్ గాంధీ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రను మంగళవారం ఉదయం కొద్దిసేపు నిలిపివేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అమేథీలోని ఫుర్సత్‌గంజ్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది..బెంగళూరులో 2018 విలేకరుల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah)పై “అభ్యంతకరమైన” వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 2018లో బీజేపీ నేత విజయ్ మిశ్రా రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు(defamation case) దాఖలు చేశారు. అప్పటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హయాంలో జరిగిన హత్య కేసులో బీజేపీ ప్రమేయం ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు..రాహుల్ గాంధీకి జారీ చేసిన సమన్లపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్(jairam ramesh) స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పట్టాలు తప్పదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇలాంటి వాటికి రాహుల్ గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ బెదిరిపోదని అభిప్రాయం వ్యక్తం చేశారు..

Related posts

పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం.. సంచలన విషయాలను వెల్లడించిన కల్నల్ సోఫియా

TV4-24X7 News

సైబర్ మోసాలకు చెక్ పెట్టనున్న ఎయిర్‌టెల్

TV4-24X7 News

చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు సీజ్

TV4-24X7 News

Leave a Comment