Tv424x7
Telangana

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నకిలీ VIP పాసులు

భక్తులకు నకిలీ VIP పాసులను అంటగట్టిన గుర్తుతెలియని ఓ ప్రబుద్ధుడు

అవాక్కైన ఆలయ ఈవో విజయ రామారావు హోంగార్డ్ సిబ్బంది

నిర్మల్ జిల్లా :-బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మొట్టమొదటి సారిగా అడ్డగోలు విఐపి పాసుల అమ్మకం కలకలం రేపింది…. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని నిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇవాళ భక్తులకు విఐపి పాసులను అప్పజెప్పి డబ్బులు దండుకున్నట్లు ఆలయ ఈవో విజయ రామారావు దృష్టికి వచ్చింది… ప్రధాన ఆలయం ద్వారo వద్ద విధులు నిర్వహిస్తున్న ఈవో విజయ రామారావు తోపాటు హోంగార్డ్ నకిలీ విఐపి పాసును ఓ భక్తుడి నుండి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో భక్తుడిని నిలదీయగా డబ్బులు పెట్టి తీసుకున్నానని సమాధానం ఇచ్చారు…ఏదేమైనా ఆలయ ప్రతిష్టతను దిగజారే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారని భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి విఐపి పాసులను ఎవరు నమ్మవద్దని బాసర ఆలయ ఈవో. విజయరామరావు భక్తులకు సూచించారు… ఏవైనా సమస్య లుంటే నేరుగా ఆలయ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన అన్నారు….

Related posts

రైతుల గోస – యూరియా పాపం ఎవరిది?

TV4-24X7 News

హోంగార్డు దుర్మార్గం.. గర్భస్రావం ప్రయత్నంలో మహిళ దుర్మరణం..

TV4-24X7 News

ఇందిరమ్మ ఇండ్లకు కాల్ సెంటర్ ప్రారంభం..

TV4-24X7 News

Leave a Comment